మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ (AIIMS – All India Institute of Medical Sciences) ఆసుపత్రి వసతి గృహంలో డయేరియా (Diarrhea) వ్యాప్తి కలకలం రేపుతోంది. హాస్టల్‌లో ఉన్న సుమారు 25 మంది విద్యార్థులు (Medical Students) మరియు సిబ్బంది అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు.
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులు
గత మూడు రోజులుగా హాస్టల్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్లు సమాచారం. డయేరియా లక్షణాలు కనిపించడంతో బాధితులను వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
నీటి కాలుష్యమే కారణమా?
హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి డయేరియా లక్షణాలు కనిపించడంతో నీటి కాలుష్యం (Drinking Water Contamination) కారణం కావచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హాస్టల్‌కు సరఫరా అవుతున్న నీటి వనరులపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడి నుంచి నీటి సరఫరా జరుగుతోంది? ఏ దశలో కలుషితం అయ్యే అవకాశం ఉందా? అనే అంశాలపై విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలో హాస్టల్‌లోని కుళాయిల నుంచి సుమారు 40 నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. పరీక్షా నివేదికలు వచ్చిన తర్వాత అసలు కారణం ఏమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్ హాస్టల్‌లో డయేరియా.. 25 మంది విద్యార్థులు అస్వస్థత








