బ్రిటన్ రాజు చార్లెస్-3 ఇటీవల ప్రజలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన అత్యవసర సేవల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సరదాగా ముచ్చటించారు. ఈ సమావేశంలో భారత సంతతికి చెందిన సిక్కు ప్రతినిధి హర్విందర్, రాజుతో మాట్లాడే అవకాశం పొందారు.
“రాజు గారు, మీరు ఎలా ఉన్నారు?” అని హర్విందర్ అడిగిన ప్రశ్నకు చార్లెస్-3, “నేనింకా బతికే ఉన్నా,” అని సరదాగా స్పందించారు. ఆయన స్పందన ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిలో చిరునవ్వులు పూయించింది. ఇది చార్లెస్-3 వ్యక్తిత్వానికి, ఆయన సానుకూల దృక్పథానికి మంచి ఉదాహరణగా నిలిచింది.
క్యాన్సర్‌తో పోరాటం..
కింగ్ చార్లెస్-3 తన 76 ఏళ్ల వయస్సులోనూ క్యాన్సర్‌తో యుద్ధం చేస్తున్నారు. ఆయనకు ఎక్స్పర్ట్స్ డాక్టర్స్‌తో కూడా ఒక టీమ్ ఆయనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తుంది. ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 ఆరోగ్యం నిలకడగానే ఉందని, 2025లోనూ క్యాన్సర్ చికిత్స కొనసాగించనున్నట్లు అక్కడి పత్రికల కథనాలు చెబుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అక్కడి వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.