విజయ్ – రష్మిక.. ఇద్దరి ఆస్తీ ఎంతో తెలుసా?

విజయ్ – రష్మిక మందన్న ఇద్దరి ఆస్తీ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ప్రేమజంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్లి సంబరాలు ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఫిబ్రవరి 26న ఘనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, మార్చి 4న అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరుపుకోనున్నారు.

రాజకీయ ప్రముఖులు, సినీ తారలు హాజరవుతున్న ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. పెళ్లి తర్వాత కూడా ఈ స్టార్ కపుల్ ఫుల్ బిజీగా ఉండగా, తమ స్వగ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.

ఇక పెళ్లి కానుకల విషయానికి వస్తే, విజయ్ తల్లి మాధవీ (Vijay’s mother Madhavi)కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు అందించడం విశేషం. మరోవైపు విజయ్ దేవరకొండ తన భార్యకు హైదరాబాద్‌లో అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన విల్లాను కానుకగా ఇచ్చారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సుమారు రూ.90 కోట్ల విలువైన ఈ బంగ్లా గురించిన ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పెళ్లి తర్వాత ఈ జంట ఆస్తుల విలువ (Property Value) గురించిన చర్చ కూడా జోరుగా సాగుతోంది. సినీ పరిశ్రమలో వరుస విజయాలతో భారీగా సంపాదించిన వీరిద్దరి కలిపి ఆస్తులు సుమారు రూ.140 కోట్ల వరకు ఉంటాయని టాక్. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్‌కు పెళ్లి కారణంగా చిన్న విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రేమలో మొదలైన ఈ ప్రయాణం, ఇప్పుడు పెళ్లి బంధంతో మరింత బలపడగా, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment