సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న హీరో శ్రీతేజ్ తరఫున ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఓ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ట్రస్టు ద్వారా శ్రీతేజ్ కోసం రూ.2 కోట్ల నిధులు జమచేస్తారని, వీటిని అతని వైద్య, భవిష్యత్తు అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, అతని కుటుంబం, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కలిసి సమన్వయం చేసుకుని, ఈ భారీ మొత్తాన్ని శ్రీతేజ్ మేలు కోసం జమ చేయనున్నారు.
ఈ ట్రస్టు ఎందుకు?
శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండడంతో సహాయం అవసరం అయ్యింది. రూ.2కోట్లతో నిధి ఏర్పాటు చేసి ఈ ట్రస్టు ద్వారా శ్రీతేజ్ వైద్యం, చదువు, భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బాధిత కుటుంబాన్ని కలిసి అంగీకార పత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ట్రస్టు ఏర్పాటు, నిధుల జమ విషయమై పుష్ప చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.