మినీ ఎలక్షన్ వార్‌కు రంగం సిద్ధం కానుందా?

మినీ ఎలక్షన్ వార్‌కు రంగం సిద్ధం కానుందా?

దేశ రాజకీయాల్లో మరోసారి మినీ ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రత్యేక ఓటర్ సర్వే పూర్తి చేసినట్లు సమాచారం. ఆదివారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసి, సోమవారం లేదా మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికల ప్రక్రియను ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల బోర్డు పరీక్షలు, రాబోయే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఎన్నికల వాతావరణం ఇప్పటికే వేడెక్కింది.

తమిళనాడులో సీఎం స్టాలిన్ మహిళల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోగా, ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమై ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment