జాతీయ గీతంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

కేంద్రం వందేమాతర గీతంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన ఆలాపనకు ముందే వందేమాతరం ప్లే చేయాల్సిన ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, గతంలో తొలగించబడిన నాలుగు చరణాలను తిరిగి చేర్చుతూ, మొత్తం ఆరు చరణాలను వినిపించాలని కేంద్రం సూచించింది.

బుధవారం ఉదయం నుంచి ఈ నిబంధనలను కఠినంగా పాటించాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల ప్రకారం, వందేమాతరం గీతం పాడేటప్పుడు అందరూ నిలబడాలి. అదనంగా, పద్మ అవార్డుల వంటి పౌర పురస్కార ప్రదానోత్సవాలు, రాష్ట్రపతి హాజరయ్యే ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభం, ముగింపు సందర్భంగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది.

సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వందేమాతరం ప్లే చేయవచ్చునని, కానీ నిలబడటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. గత సంవత్సరం కాంగ్రెస్-బీజేపీ మధ్య ఈ గీతంపై పెద్ద రాజకీయ వివాదం సంభవించిన నేపథ్యంలో 1937లో తొలగించిన నాలుగు చరణాలను తిరిగి చేర్చినట్టే ఈ మార్గదర్శకాలు ప్రకటించబడ్డాయి. జాతీయ గీతాన్ని అంతరాయం కలిగించేవారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అవకాశం ఉంటుందని కూడా అధికారులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment