‘సప్త సాగరాలు దాటి’ నుంచి ‘కాంతార 2’ వరకు: రుక్మిణి వసంత్

‘సప్త సాగరాలు దాటి’ నుంచి ‘కాంతార 2’ వరకు: రుక్మిణి వసంత్

Summarize with AI

నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా కన్నడ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాల్లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో రుక్మిణికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో లక్షలాది మంది అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. సింపుల్ లుక్స్, స్పష్టమైన అభిప్రాయాలు, సినిమాల ఎంపికలో చూపించే పరిపక్వత వల్ల యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా రుక్మిణి దగ్గరైంది. ఆమె చేసే పాత్రల ఎంపికే ఆమెకు బలమైన అభిమాన వర్గాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

రుక్మిణి వసంత్ నటించిన సినిమాల్లో ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ’ (Sapta Sagaradaache Ello – Side A) ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బీ’, ‘బనారసి’, ‘లవ్ మాక్‌టెయిల్’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా భావోద్వేగాలు ప్రధానంగా సాగే కథల్లో ఆమె నటన చాలా సహజంగా ఉంటుందని అభిమానులు భావిస్తారు. ఈ మధ్య కాలంలో కాంతార-2 (Kantara 2) సినిమా ప్రత్యేకంగా బ్లాక్ బూస్టర్ మూవీ నిలిచింది. దీంతో రుక్మిణి కి మరింత క్రేజ్ తెప్పించిదని చెప్పుకోవాలి. ఈ విధంగా నాణ్యమైన సినిమాలతో, బలమైన నటనతో రుక్మిణి వసంత్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తన స్థానం మరింత పటిష్టం చేసుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment