పున్నమి ఘాట్‌లో కారు బీభత్సం.. నలుగురు అరెస్ట్ (Video)

పున్నమి ఘాట్‌లో కారు బీభత్సం.. నలుగురు అరెస్ట్

విజయవాడ (Vijayawada) పున్నమి ఘాట్‌ (Punnami Ghat)లో రెండ్రోజుల క్రితం జరిగిన కారు బీభత్సం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యం (Alcohol) మత్తులో అతి వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రజలపైకి దూసుకెళ్లిన ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల‌ను న‌డిరోడ్డుపై న‌డిపించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మద్యం సేవించిన నిందితులు పున్నమి ఘాట్ ప్రాంతంలో అత్యంత వేగంగా కారు నడిపారు. ఈ క్రమంలో వారి డ్రైవింగ్‌ను ప్రశ్నించిన స్థానికులు, మీడియా ప్రతినిధులపై దాడి చేయాలనే ఉద్దేశంతో కారుతో ఢీకొట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు, సాక్షి టీవీ ప్రతినిధి నాగేంద్ర (Nagendra)తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం 9 ఏళ్ల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనకు కారణమైన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా, వారిపై ఇప్పటికే పలు గంజాయి కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మరో నిందితుడు జక్కుల దినేష్ (Jakkula Dinesh) పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అరెస్ట్ అయిన నిందితులను భవానీపురం పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ ప్రజలకు హెచ్చరికగా చూపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment