అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

అభిమానం హద్దులు దాటితే ప్రమాదాలకు దారి తీస్తుందనే విషయాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan)కు ఎదురైన తాజా ఘటన మరోసారి రుజువు చేసింది. సూరత్ ఎయిర్‌పోర్ట్‌ (Surat Airport)లో బిగ్ బిని చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన కారు వైపు వెళ్తున్న సమయంలో సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ కోసం ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ గేట్ (Airport Exit Gate) వద్ద ఉన్న భారీ గాజు అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అదృష్టవశాత్తు అమితాబ్ కొద్దిగా పక్కకు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనతో అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని సమాచారం. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా కారులోకి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానానికి హద్దులు అవసరమని, సెలబ్రిటీల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment