బెంగాల్‌లో ఈడీ దాడులు.. అమిత్ షాపై మమత ఫైర్!

బెంగాల్‌లో ఈడీ దాడులు.. అమిత్ షాపై మమత ఫైర్!

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) దాడులు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా, ఐపీఏసీ చీఫ్ ప్రతీక్ జైన్ (Prateek Jain) నివాసంపై జరిగిన దాడులు మరింత సంచలనంగా మారాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్వయంగా సంఘటనాస్థలికి చేరుకోవడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. మమత రాకతో అక్కడ రాజకీయ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, అభ్యర్థుల జాబితాలను సేకరించడమే ఈడీ, అమిత్ షా పని అయ్యిందా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడలేని హోంమంత్రి తన పార్టీ పత్రాలను ఎలా తీసుకెళ్తాడని ప్రశ్నించారు. ఒకవైపు పశ్చిమ బెంగాల్‌లో SIR పేరిట ఓటర్ల పేర్లు తొలగిస్తోందని, మరోవైపు తమ పార్టీకి చెందిన గోప్య సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు. దీనీపై బీజేపీ(BJP) కూడా ఎదురుదాడికి దిగింది. అయితే నకిలీ ఉద్యోగాల రాకెట్ దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగాయని ఈడీ స్పష్టం చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Join WhatsApp

Join Now

Leave a Comment