కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మంత్రులు సీతక్క, సురేఖ?

కేసీఆర్ ఫామ్ హౌస్ కి మంత్రులు సీతక్క, కొండా సురేఖలు

ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ (Erravalli Farm House)లో మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)ను మంత్రులు సీతక్క (Minister Sitakka), కొండా సురేఖలు (Minister Konda Surekha) ఈరోజు మధ్యాహ్నం కలవనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు (Medaram Sammakka–Saralamma Maha Jatara) అధికారికంగా ఆహ్వానించేందుకు ఈ భేటీ జరగనుంది. మేడారం మహా జాతరను ఘనంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మంత్రి సీతక్క ఇప్పటికే పలు రాజకీయ, సామాజిక వర్గాల ప్రముఖులను కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికలను అందజేస్తుండగా, అదే క్రమంలో నేడు కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మేడారం జాతర తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీయగా, కేసీఆర్ మేడారం జాతరకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment