ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన నటనతో హిందీ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2 ది రూల్’ హిందీ ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈనెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.601.50 కోట్లు (నెట్) వసూలు చేసి, అత్యంత వేగంగా ఈ మార్కును దాటిన చిత్రంగా నిలిచింది.
‘పుష్ప-2’ రికార్డుల పరంపర
సినిమా విడుదలైనప్పటి నుంచే అంచనాలను అధిగమిస్తూ పాన్-ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందీలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఘనతతో అల్లు అర్జున్, భారతీయ సినిమా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నారు.