లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. యూట్యూబర్ ప్రసాద్ తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకారని, కొద్ది నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ప్రసాద్ బెహరాకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు వెనుక ఉన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతుండగా ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.
వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని చెప్పి ఆమె పట్ల ప్రసాద్ బెహరా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, షూట్ లొకేషన్లో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో యువతి తీవ్ర ఇబ్బందులకు గురయ్యేదని తెలుస్తోంది. ప్రసాద్ వేధింపులు భరించలేక ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.