వరంగల్‌లో జరిగిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా లాంచ్ ఈవెంట్‌లో ప్రేక్షకులు విశేష ఉత్సాహాన్ని చూపారు. ప్రత్యేకంగా లాంచ్ చేసిన “వామ్మో వయ్యో” సాంగ్ స్టేజ్‌పై హీరోయిన్స్ సందడి, ఫుల్ జోష్ డాన్స్ స్టెప్పులతో వినోదాన్ని మరింత పెంచింది. క్యాచీ లిరిక్స్, మాస్ బీట్, ఆర్టిస్టుల చిరునవ్వులు ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మార్చాయి. ఈ సాంగ్ లాంచ్ అయిన క్షణం నుండే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అభిమానుల్లో సినిమా మీద అంచనాలను పెంచేలా పనిచేస్తోంది.
Wignyapthiగా విడుదలైన #VaammoVaayyo సాంగ్ యూట్యూబ్‌లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మంచి వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ పాట, సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ప్రేక్షకుల పాజిటివ్ బజ్, ఆసక్తి మధ్య #BMW (భర్త మహాశయులకు విజ్ఞప్తి) సినిమా జనవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. వినోదం, ఎనర్జీ, ఫ్రెష్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి పండగ అనుభూతిని అందించేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నారు.








