తాడిపత్రిలో రేపు నిరాహార దీక్ష చేయబోతున్నా.. – జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో రేపు నిరాహార దీక్ష చేయబోతున్నా.. - జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి (Tadipatri)లో తన ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన ప్రకటన చేశారు. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉందని, తాను ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో ప్రజలకు వివరించేందుకే రేపు తాడిపత్రిలో నిరాహార దీక్ష (Hunger Strike) చేయబోతున్నానని ఆయన ప్రకటించారు. తన ప్రవర్తన మంచిదా కాదా అన్నది ప్రజలనే అడగాలని, అది మంచిది కాదని ప్రజలు భావిస్తే తప్పకుండా తన ప్రవర్తనను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని జేసీ తెలిపారు.

2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలన్నదే తన కోరిక అని పేర్కొన్న జేసీ, తన ఆలోచనలు, లక్ష్యాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపడుతున్నానని చెప్పారు. అయితే ఈ నిర్ణయంపై తాడిపత్రిలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రవర్తనలో మార్పు కావాలంటే నిరాహార దీక్షలు కాదు, అవసరమైతే వైద్యులు లేదా మానసిక వైద్యుల సలహాలు తీసుకోవాలని తాడిప‌త్రి ప్ర‌జ‌లు సెటైర్లు పేల్చుతుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అధికార పార్టీలో ఉండి దీక్షలు చేస్తూ ప్రజల్లో మరింత ప‌లుచ‌న కావొద్దని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి. ఈ వింత నిర్ణయంతో జేసీ అనుచరులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment