‘AA22 x A6’ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్

‘AA22 x A6’ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరియు మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ (AA22 x A6) పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్నారనే విషయం వెల్లడయింది. అలాగే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అత్యాధునిక VFX సాంకేతికతతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదలకు సిద్ధమయ్యే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా, ఈ సినిమా ఓటీటీ డీల్ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ (Netflix) డిజిటల్ రైట్స్ కోసం రూ. 600 కోట్లు ఆఫర్ చేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సాధించిన రూ. 275 కోట్ల రికార్డును ఇది రెట్టింపు చేస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమాటోగ్రఫీ చరిత్రలో అత్యధిక ఓటీటీ రేట్ సాధించే చిత్రం గా సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టించనుంది. అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ “ఇది మా హీరో రేంజ్” అంటూ ఘనంగా స్పందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment