---Advertisement---

‘జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా’.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

'జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా'.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం
---Advertisement---

క‌డ‌ప‌లో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో టీడీపీ కంటే వైసీపీ ప‌రిపాల‌న‌లో పెరిగిన సంప‌దను లెక్క‌ల‌తో స‌హాఆ ఫ్లెక్సీలో వివ‌రించారు. రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి స‌మాధానాల‌ను ఇలా ఫ్లెక్సీ వేయించి ‘సీమ యాస‌’లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

వ్యవసాయం, ఫారెస్ట్రీ మరియు ఫిషింగ్ రంగాల్లో
2018-19 (TDP ప్రభుత్వం)లో రూ.2,61,448 కోట్లు
2023-24 (YSRCP ప్రభుత్వం)లో రూ. 4,31,100 కోట్లకు పెరిగింది.
ఈ రంగాల్లో వార్షిక వృద్ధి రేటు 12.97% న‌మోదైంది.

మైనింగ్ మరియు క్వారీయింగ్‌లో..
2018-19 (TDP ప్రభుత్వం)లో రూ. 20,955 కోట్లు
2023-24 (YSRCP ప్రభుత్వం)లో రూ.32,259 కోట్లకు పెరిగింది.
వార్షిక వృద్ధి రేటు: 10.78% న‌మోదైంది.

ఉత్ప‌త్తుల్లో..
2018-19 (TDP ప్రభుత్వం)లో రూ.67,393 కోట్లు
2023-24 (YSRCP ప్రభుత్వం)లో రూ.1,29,806 కోట్లుకు ఎగ‌బాకింది.
వార్షిక వృద్ధి రేటు: 18.52%గా న‌మోదైంది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల్లో..
2018-19 (TDP ప్రభుత్వం)లో రూ.13,297 కోట్లు
2023-24 (YSRCP ప్రభుత్వం)లో రూ.24,766 కోట్లకు పెరిగింది.
వార్షిక వృద్ధి రేటు: 17.25% న‌మోదైంది.

నిర్మాణ రంగంలో..
2018-19 (TDP ప్రభుత్వం)లో రూ.56,106 కోట్లు
2023-24 (YSRCP ప్రభుత్వం)లో రూ.95,749 కోట్లకు పెరిగింది.
వార్షిక వృద్ధి రేటు: 14.13% న‌మోదైంది.

వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు
2018-19 (TDP ప్రభుత్వం)లో రూ.58,142 కోట్లు
2023-24 (YSRCP ప్రభుత్వం)లో రూ.89,716 కోట్లకు పెరిగింది.
వార్షిక వృద్ధి రేటు: 10.86% న‌మోదైంది.

రాజ్యసభలో వైసీపీ ఎంపీ Y.V సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి ఈ సమాధానాలు ఇచ్చార‌ట‌. రాజ్యసభ సాక్షిగా గత ఐదేళ్లలో జగన్ సృష్టించిన సంపద అన్నా.. కరోనా లాంటి విప‌త్క‌ర‌ పరిస్థితులు ఎదుర్కొని కూడా అన్నిట్లో కలుపుకొని 2018-19కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్క సృష్టించి ఉండ్లా జగన్‌

2018-19కి రాష్ట్ర GSDP – 7.9 లక్షల కోట్లుగా వుంటే, 2023-24 కి రాష్ట్ర GSDP 12.91 లక్షల కోట్లుకి చేర్చి పెట్టుండ్లా మన జగన్‌. GSDP అంటే ఎందో అనుకుంటండారా మీరు.. ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర. అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లున్నా..

సంపద సృష్టించడం అంటే ఇది కదూ మరి".. వొన్నో ఈ పార్టీకి నాకు ఏం సంబంధం లా.. ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చేప్తా ఉండ అంతే“ అంటూ ఆ ఫ్లెక్సీ చివ‌ర్లో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment