చెత్త రిక్షాలో మృత‌దేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన (Video)

చెత్త రిక్షాలో మృత‌దేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని మన్యం జిల్లా (Manyam District)లో చోటుచేసుకున్న హృద‌య‌విదార‌క‌ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధ‌మ్మ (Radhamma (65) అనే వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యుల సహాయంతో భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆమె మరణానంతరం కనీస మానవతా సౌకర్యం కూడా కల్పించలేకపోయిన ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చివేస్తోంది.

ఆసుపత్రిలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ వాహనానికి అద్దె చెల్లించే స్థోమత లేకపోవడంతో, చివరకు చెత్త రిక్షాపై (Garbage rickshaw) రాదమ్మ మృతదేహాన్ని తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల తరలింపున‌కు (Transportation of Dead Bodies) కూడా అంబులెన్స్ సౌకర్యం (Ambulance Facility) లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పేద ప్రజల ప్రాణాలకు, గౌరవానికి విలువ లేని వ్యవస్థ ఇది అంటూ స్థానికులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కనీస ఆరోగ్య వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment