ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple) వద్ద తనిఖీల్లో భారీగా మద్యం మరియు మాంసం పట్టుబడింది. శ్రీశైలం టోల్గేట్ (Srisailam Tollgate) వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కలిసి ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు.
తనిఖీల్లో సుమారు 200 కిలోల మాంసం (Meat)తో పాటు భారీ మొత్తంలో మద్యం సీసాలు (Alcohol Bottles) పట్టుబడ్డాయి. ఈ వ్యవహారాన్ని గుర్తించిన దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు (Srinivasarao) నేతృత్వంలో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. శ్రీశైలానికి అక్రమంగా మాంసం, మత్తు పానీయాలు తరలిస్తున్నట్టు నిర్ధారించుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వాహనాలు, నిషేధిత వస్తువులను శ్రీశైలం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు సీఏస్ఓ శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ పరిసరాల్లో నిషేధిత పదార్థాల రవాణా పూర్తిగా నిషేధమని, భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు, పర్యాటకుడు తప్పనిసరిగా దేవస్థానం నిబంధనలు పాటించాలి అని హెచ్చరించారు. నిషేధిత పదార్థాలు, మద్యం, మాంసాన్ని దేవస్థాన పరిధిలోకి అనుమతించబోమని, భవిష్యత్తులో కూడా తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు.
శ్రీశైలం టోల్గేట్ దగ్గర భారీగా మద్యం, మాంసం
— Telugu Feed (@Telugufeedsite) December 25, 2025
200 కేజీల మాంసం, భారీగా మద్యం సీజ్ చేసిన చీఫ్ సెక్యూరిటీ అధికారి
శ్రీశైలానికి అక్రమంగా మాంసం తీసుకెళ్తున్నట్లు గుర్తింపు, ఇద్దరు అరెస్టు pic.twitter.com/zq5zgyXos9








