Public duty or Political servitude?.. PK’s politics: Governance abandoned, opposition abused

Public duty or Political servitude?.. PK’s politics: Governance abandoned, opposition abused

Andhra Pradesh is witnessing a disturbing shift where governance has taken a back seat and political servitude has taken centre stage. Deputy Chief Minister Pawan Kalyan, instead of discharging constitutional responsibility, has reduced his role to that of a political shield for Chief Minister N. Chandrababu Naidu. Promises made to the people lie unfulfilled, while relentless personal attacks on former Chief Minister YS Jagan Mohan Reddy and the opposition dominate the political discourse.

Is defending Chandrababu the official duty?

The Deputy Chief Minister’s office today appears indistinguishable from unquestioned loyalty to Chandrababu Naidu. Fifteen years of political allegiance raises a fundamental question: was it meant for public welfare or for glorifying one individual? Whenever citizens question broken promises, the response is not accountability but abusive language and threats. Violence-laced metaphors and intimidation are unbecoming of a constitutional authority and expose frustration, not strength.

Abuse instead of answers

In recent days, political engagement has been reduced to a single obsession, attacking the opposition. The result is a growing public perception that those in power have no answers to governance failures. Questions on people’s issues are met not with explanations, but with personal abuse, even at party forums, without provocation. Accountability has been replaced by aggression.

Medical Colleges Privatisation: Public anger erupts

The privatisation of government medical colleges has laid bare the coalition’s intent. Ten new government medical colleges, public assets with long-term value running into lakhs of crores, are being handed over to private interests and benamis. This is widely seen as a betrayal of the state’s future. More than one crore citizens came forward voluntarily to oppose the move, transforming public resistance into a referendum-like rejection. The scale of response shows how deeply every family in Andhra Pradesh is affected.

Diversion politics through provocation

Whenever serious controversies surface, diversion becomes the default strategy. Abusive rhetoric and provocation are deployed to shift attention away from policy failures and scams. The public, however, is politically conscious and fully aware of these tactics. Distractions no longer work.

 

Questions that cannot be dodged

  • Who insulted whom first, and what exactly was said?
  • Is it wrong to warn that those responsible for privatising public medical colleges will face legal consequences?
  • Health is not under the Deputy CM’s portfolio, why the disproportionate aggression?
  • Is there a personal stake, guarantee, or role in these privatisation deals?
  • What exactly is the long-term political “deal” openly claimed with Chandrababu Naidu?

Contract politics, Not public service

What is unfolding is contract politics, unconditional loyalty replacing ideology and public service. Even within Janasena, confusion and disillusionment are visible, especially after claims that party organisation itself is unnecessary. Targeting the opposition daily, merely to protect the ruling leadership, is not politics, it is abdication of responsibility.

People’s issues pushed to the margins

While political theatrics dominate, real issues remain unresolved:

  • Law and order continues to deteriorate
  • Students die amid poor hostel facilities
  • Farmers face distress and suicides
  • Fee reimbursement delays cripple education
  • Aarogyasri and public healthcare weaken

Governance failures are masked by noise.

Threats, confusion and overreaction

Recent conduct reflects overreaction, irritation and confusion. Claims of threats to life and dramatic vows to crush rowdyism ring hollow when police and administration are firmly under the ruling coalition’s control. Power without clarity breeds chaos.

Who is the real rowdy?

Selective outrage raises uncomfortable questions:

  • Who is behind land grabbing, gambling dens and ration rice smuggling?
  • Why no action on ganja sales involving ruling party associates?
  • Who assaulted youths in Rajahmundry over flex banners?

Double standards stand exposed.

‘Feed and Noise’ Politics

Politics has been reduced to timely rewards and loud, scripted rhetoric. Every time governance failures surface, the opposition becomes the target. The one-crore-signature movement against medical college privatisation rattled the ruling camp, triggering diversionary politics at full throttle.

Who is afraid, and why?

When even IAS and IPS officers are said to be afraid, the question is obvious: afraid of whom? If the coalition is in power, fear among officials signals a deep law-and-order crisis and an atmosphere of coercion.

18 months: What has been achieved?

After 18 months in office, what stands as an achievement?

  • Any landmark welfare or development milestone?
  • Why seek nominations for supporters instead of empowering them through governance?

This stands in stark contrast to Y.S. Jagan, who built his own party, contested alone without alliances, won decisively, and governed with a clear mandate.

Final Word

With rural development under charge and central schemes like MGNREGA being diluted, placing heavy financial strain on Andhra Pradesh and deleting lakhs of job cards, silence on core responsibilities is glaring. Abuse, theatrics and diversion cannot replace governance. People will not tolerate deception, servitude, and abandonment of public duty for long.

23.12.2025

బాధ్యతా? ఊడిగమా?

– చంద్రబాబుకు ఊడిగం చేయడమే మీ పదవీ బాధ్యతా పవన్?

– 15 ఏళ్లు ఊడిగం.. ప్రజలకు మంచి చేయడానికా బాబుకు బాకా ఊదడానికా?

– ఇచ్చిన హామీల గురించి అడిగితే ఈ పీకుడు భాష ఏంటి?

– తోలు తీయడాలు, చేతి రేఖలు అరగదీయడాలు ఏంటి?

– వైయస్సార్ సీపీపై ఇంత దుగ్ధ ఎందుకు?

– శాశ్వతంగా అధికారానికి దూరం చేయడానికి నువ్వెవరు?

– ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కించి రౌడీయిజం ఏంటి?

– మాజీ సీఎం వైయస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలతో ఇంత కడుపుమంట దేనికి?

– ప్రజల ఆస్తులను ప్రైవేటుకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?

– అవినీతి సామ్రాజ్యం, రెడ్ బుక్ దాష్టీకాలను సహించేది లేదు

– ప్రజా క్షేత్రంలో మీ బండారం బయటపెట్టి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే..

– డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైయస్సార్ సీపీ ఆగ్రహం

టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మానేసి, వైయస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై అవాక్కులు చవాకులు పేలడమే పనిగా పెట్టుకున్నారని వైయస్సార్ సీపీ మండిపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీలోని టీడీపీ నేతలు కొందరికి ప్రతిరోజూ ఇదే పని అని ధ్వజమెత్తింది. తాజాగా వైయస్ జగన్, వైయస్సార్ సీపీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైయస్సార్ సీపీ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబుకు ఊడిగం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అటకెక్కించి, ప్రశ్నించిన వారిని తోలు తీస్తా, పీకలేరు… అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉందని వైయస్సార్ సీపీ మండిపడింది.

వైయస్సార్‌సీపీని తిట్టడమే పని:

గడచిన నాలుగైదు రోజులుగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఒకటే పనిగా కనిపిస్తోంది. అదే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ విమర్శలు, తిట్లు చూసిన తర్వాత అందరిలో ఒక అనుమానం వస్తోంది. అసలు అధికారంలో ఉన్నది వాళ్లా? లేక మేమా? అన్న సందేహం కలుగుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్లే. పైగా సీఎం చంద్రబాబు ఆ పదవిలో 15 ఏళ్లు ఉండాలంటున్న పవన్‌కళ్యాణ్, అందుకు తన బేషరతు మద్దతు కూడా ప్రకటించారు. ఇప్పుడు వైయస్సార్ సీపీ ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజాగొంతుకగా అధికారపక్షాన్ని నిలదీస్తోంది. వారి తప్పులు ఎత్తి చూపుతోంది. వైయస్సార్ సీపీ అడిగే ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. లేదంటే ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్న పవన్‌కళ్యాణ్‌ చెప్పాలి. కానీ, ఆ పని చేయని పవన్‌కళ్యాణ్, అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైయస్సార్ సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా.. సమయం, సందర్భం ఏదైనా, చివరకు తన పార్టీ సమావేశమైనా సరే.. మమ్మల్ని తిట్టడం, దుమ్మెత్తి పోయడం చేస్తున్నారు. అసలు పవన్‌కళ్యాణ్‌ను ఎవరు, ఏమన్నారని ఆయన, ఆ విధంగా స్పందిస్తున్నారు? కేవలం మమ్మల్ని తిట్టడమే పని అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? నిజానికి పవన్‌కళ్యాణ్‌ను ఎవరూ, ఏమీ అనకపోయినా, ఆయనే వైయస్సార్ సీపీపై పిచ్చిగా రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. బూతులు కూడా తిడుతున్నారు. అంత పరుష పదజాలాన్ని ఆయన ఎందుకు వాడుతున్నారనేది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన అంశం.

ప్రజల ఆస్తులు బినామీలకు కట్టబెట్టడం కనపడలేదా?

మెడికల్‌ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల ముందు అడ్డంగా దొరికిపోయింది. భవిష్యత్తులో లక్ష కోట్లు విలువ చేసే 10 కొత్త మెడికల్‌ కాలేజీలను అప్పనంగా, అడ్డగోలుగా చంద్రబాబు తన వాళ్లకు, తన బినామీలకు కట్టబెడుతూ దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాన్ని వైయస్సార్ సీపీ ఎండగట్టింది. పార్టీ పోరాటాన్ని ప్రజలు కూడా గుర్తించారు. చంద్రబాబు, ఆయనతో ఉన్న వ్యక్తులు కలిసి కొత్త గవర్నమెంటు మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ.. దాని వెనుక భారీ అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని స్పష్టంగా గ్రహించారు. అందుకే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కోటి మందికి పైగా ఏ భయం లేకుండా స్వచ్ఛందంగా కదిలి వచ్చి, సంతకాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంతకాల ద్వారా కూటమి ప్రభుత్వం మీద తమ అవిశ్వాసాన్ని, అభిశంసనను రెఫరెండం తరహాలో తేల్చి చెప్పారు. అంతలా రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మెడికల్‌ కాలేజీల అంశం బలంగా తాకింది.

యథావిథిగా డైవర్షన్‌ పాలిటిక్స్‌

ఎప్పుడు, ఏ సమస్య వచ్చినా తాను సేఫ్‌గా ఉండేందుకు, చంద్రబాబు అనుసరించే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఇక్కడా, ఆయన మొదలుపెట్టారు. మెడికల్‌ కాలేజీల అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పవన్‌కళ్యాణ్‌ ద్వారా చంద్రబాబు ఒక పన్నాగం పన్నారు. అదే.. పవన్‌కళ్యాణ్‌ ద్వారా వైయస్సార్ సీపీని, నాయకులను ఇష్టానుసారం తిట్టిస్తే.. మనసు బాధపడి వైయస్సార్‌సీపీ నుంచి ఎవరైనా గట్టిగా ఒక మాట అంటే, దాన్ని పట్టుకుని రాజకీయం చేయాలనేది చంద్రబాబు వ్యూహం. అందులో భాగంగానే అడ్డూ, అదుపూ లేకుండా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌ వైఖరిని అర్థం చేసుకోని వారెవరూ లేరు. వైయస్సార్ సీపీ నుంచి ఎవరూ, ఏమీ అనకపోయినా, సడెన్‌గా వచ్చి పవన్‌కళ్యాణ్‌ అలా ఎందుకు మాట్లాడుతున్నారో గ్రహించలేని స్థితిలో ప్రజలు లేరని, అంతటి రాజకీయ అజ్ఞానం ప్రజలకు లేదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ గుర్తించాలి.

వీటికి సమాధానం చెప్పగలరా?:

-పవన్ ను ఎవరైనా ఏమైనా అన్నారా? అలా ఎవరైనా అంటే, ఏమన్నారో చెప్పండి.

-మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌ చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని, కేసులు పెట్టి జైళ్లకు పంపుతామని వైయస్ జగన్ హెచ్చరించారు. ఇది తప్పా?

-వైద్య ఆరోగ్య శాఖ అన్నది పవన్‌కళ్యాణ్‌ చేతిలో లేదు కదా? మరెందుకు రియాక్ట్‌అవుతున్నారు? లేదు. నాకూ ఈ ప్రైవేటీకరణ వ్యవహారంలో సంబంధం ఉందని చెప్పాలనుకుంటే, నిర్భయంగా ఆ మాట చెప్పాలి కదా?

-చంద్రబాబు, ఆయన మనుషుల మధ్య ఈ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన అగ్రిమెంట్స్, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన బాండ్లకు నాదీ పూచీకత్తు అన్నట్లు.. ఇక్కడ కూడా పవన్‌కళ్యాణ్‌ పూచీకత్తు తీసుకున్నారా?

-రాష్ట్ర ప్రయోజానాల కోసం మేం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ గట్టిగా ప్రశ్నిస్తుంటే, పవన్‌కళ్యాణ్‌కు సంబంధం లేకపోయినా వైయస్సార్ సీపీని తిడుతున్నారంటే, వైయస్సార్ సీపీ వాళ్లు ఏమీ అనకపోయినా పరుష పదజాలంతో, అప్రజాస్వామిక పద్ధతిలో తిడుతున్నారంటే దానికి కారణం.. ఈ వ్యవహారంతో ఆయనకూ సంబంధం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ అది నిజమైతే, ఆ డీల్‌ ఏమిటి?

-ఎందుకంటే అలాంటి డీల్స్‌ మీకు కొత్త కాదు. చంద్రబాబుతో పవన్ కు డీల్‌ అందరికీ తెలిసిందే. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ, ఇంకో పార్టీతో డీల్‌ చేసుకోవడం కేవలం పవన్‌కళ్యాణ్‌ ద్వారానే ప్రజలంతా చూస్తున్నారు. పైగా వచ్చే 15 ఏళ్లపాటు కూడా ఈ డీల్‌ ఉంటుందని పవన్‌కళ్యాణ్‌ పదే పదే చెబుతున్నారు.

పవన్‌ రాజకీయం.. ఆద్యంతం అదే వ్యవహారశైలి

ఒక రాజకీయ పార్టీ, ఇంకొక పార్టీతో పొలిటికల్‌గా కాంట్రాక్ట్‌ చేసుకోవడం మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. పదవి ఒక బాధ్యత అంటూ నిన్న మంగళగిరిలో నిర్వహించిన మీటింగులో కూడా మీపార్టీ వాళ్లకు చెప్పిన మాటలు విని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. జనం ఇంకా జనసేన పార్టీకి లేరు కాబట్టి.. కమిటీలు వేయడం లేదంట! పార్టీ నిర్మాణం జరగలేదంట!. ఎవరూ ఎప్పుడూ, ఎక్కడా, వినని సిద్ధాంతం ఇది. పార్టీ ప్రజలకు చేరువ కావాలంటే నిర్మాణం ఉండాలన్నది వాస్తవమైతే.. దీనికి భిన్నంగా పవన్‌ మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ కాబట్టి, దాన్ని ఎలా నడుపుతారో వారి ఇష్టం. ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే, చంద్రబాబుతో పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ బేషరతుగా కుదుర్చుకుని వైయస్సార్ సీపీపై రోజూ విరుచుకు పడ్డం కరెక్టు కాదు.

ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి.. బాధ్యత ఉందా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాధ్యత చాలా ఉంది. అనేక ప్రజా సమస్యలున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ బాగాలేదు. హాస్టళ్లలో పిల్లలకు మంచి ఆహారం కూడా పెట్టలేని దుస్థితి. పిల్లలు చనిపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం నరకంగా మారింది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌ లేక పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇన్ని రకాల సమస్యలను తీర్చాలిన బాధ్యతలో ఉన్నారు. కానీ, అవన్నీ విడిచిపెట్టి చంద్రబాబును ప్రతిసారి కాపాడ్డానికి, ఆయన వ్యూహంలో పవన్‌కళ్యాణ్‌ ఒక టూల్‌గా మారడం.. ప్రజలను వంచించడం, మోసం చేయడమే. మ్యానిఫెస్టో పేరిట ఇచ్చిన హమీలకు పచీకత్తు తీసుకున్న పవన్‌కళ్యాణ్, ఇవాళ ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు ఎక్కడ అని ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. నమ్ముకున్న సామాజికవర్గం మావైపు చూడు అని అడుగుతోంది. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు.. టీడీపీ వాళ్ల చేతిలో ఆత్మగౌరవం కోల్పోయి చావుదెబ్బలు తింటున్నారు. పవన్‌కళ్యాణ్‌ ఉన్నాడన్న భరోసా వారికి పోయిన నేపథ్యంలో.., మళ్లీ వారిని దగ్గరకు తీసుకోవడానికి మమ్మల్ని తిట్టి, ఆ తర్వాత మాచేత తిట్టించుకుని, ఆ ముసుగులో మళ్లీ వాళ్లని లాక్కునే తప్పుడు రాజకీయాలు సరైనవేనా?.

అంతటా ఓవరాక్షనే..

పవన్‌కళ్యాణ్‌ మాటలు వింటుంటే.. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్‌. ఇంటర్వెల్‌లో ఇరిటేషన్‌. క్లైమాక్స్‌లో కన్‌ఫ్యూజన్‌ అన్నట్టుగా తయారై పోయింది పవన్‌కల్యాణ్‌గారి రాజకీయం. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియని అయోమయ వ్యధాభరిత పరిస్థితిలోకి పోయారు. పైగా ఈ మధ్యన ఆయన, తనకు ఏదో ముప్పు ఉందని – ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం అని చెబుతున్నారు. మధ్య మధ్యలో రౌడీయిజాన్ని సహించను లాంటి డైలాగులు కూడా కొడుతున్నారు. ఎందుకు ఇదంతా? అసలు పవన్ ప్రాణాలు ఎవరికి కావాలి? ఒకపక్క అధికారంలో ఉండగా, పోలీసులు, వ్యవస్థ, అజమాయిషీ అంతా వారి చేతుల్లో ఉన్నాయి. ఆ ముప్పు ఏంటో, ఎవరి వల్లో చెప్పాలి. ఆ పని ఎందుకు చేయరు?

రేఖలు అరగదీయడం ఏంటి?

ఈ మధ్య రౌడీయిజాన్ని అణిచేస్తా, రోమాలు తీస్తా, చేతి రేఖలు అరగదీస్తా.. ఆకురాయితో సానపడతా.. లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అసలు రౌడీయిజం చేస్తున్నదెవరు? జనం రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరు? కూటమి ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలున్నాయి? రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ చేస్తోంది ఎవరు? ఉత్తరాంధ్రలో భూకబ్జాలు చేస్తున్నది ఎవరు? నూజివీడులో పేకాట క్లబ్బులు నడుపుతూ పబ్లిగ్గా పట్టుపడ్డారు కదా! ఇది అంతా నడిపిస్తున్నది ఎవరు? తేల్చండి చెప్పండి చూద్దాం ! గంజాయి అమ్ముతున్నారు సొంత పార్టీ ఎంపీ మనుషులే అని ఆ ఆ పక్కనున్న తిరువూరు ఎమ్మెల్యే మీ కూటమికి కొమ్ముకాసే ఆంధ్రజ్యోతి టీవీలోనే చెప్పారు. పట్టుకున్నారా? రోమాలు తీశారా? మొన్నీ మధ్య రాజమండ్రిలో ఫ్లెక్సీలు పెట్టారు అని కొందరు యువకుల్ని చితక్కొట్టారు కదా! అలా కొట్టింది ఎవరు? దెబ్బ తిని అవమాన భారంతో రగిలిపోతున్నది ఎవరు? కళ్ల ముందు పరిణామాలు ఇలా ఉంటే.. అవన్నీ వదిలేసి గురివింద సమేత పవన్‌ నీతులు ఎందుకు చెబుతున్నారు? ఎవరి కళ్లకు గంతలు కడదామని?

మేత కూత మాత్రమే..

పవన్ రాజకీయం ఏంటంటే.. ఆయనకు మేత – కూత మాత్రమే తెలుసు. పవన్ కు ఇచ్చేది ఏదో టైముకి ఠంచనుగా ఇచ్చేయాలి. ఇచ్చేస్తున్నారు ఇప్పటి వరకూ ! మీ పొలిటికల్‌ కాల్షీట్లకు ఖరీదు కట్టే షరాబు చంద్రబాబు కాబట్టి బాగానే చూసుకుంటున్నారు. ఇక కూత. అంటే డైలాగులు పేలడం. ఇదిగో ఇలా రౌడీలు, చెమ్డాలు లాంటి డైలాగులు అన్నీ వారు రాసిచ్చిన రాతలే కదా! ఎందుకయ్యా వైయస్సార్ సీపీపై ఈ తిట్లు అంటే పరిపాలన వీళ్లకు చేత కావడం లేదు. పనులు ఏమీ జరగడం లేదు. జనం అవస్థలతో అల్లాడిపోతున్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేదు. చదువుకునే పిల్లలకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. ఆరోగ్య శ్రీ లేదు. పేదలకు వైద్యం లేదు. మనమేమో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుకు అమ్ముకోవాలి, చవగ్గా 99 పైసలకే డొల్ల కంపెనీలకి దోచి పెట్టాలి.  ఇన్ని చేస్తుంటే, వైయస్ జగన్‌ రాష్ట్రంలో చైతన్యం తెచ్చి.. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా ఓ ప్రభుత్వ దోపిడీ మీద, ప్రజల సంపదైన మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరుతో కొట్టేసే ఎత్తుగడల మీద పోరాటం చేస్తున్నారు. కోటి సంతకాలు సేకరించారు. ఆరు కోట్ల ఆంధ్రులు కళ్లు తెరిచేలా చేశారు. కోటి సంతకాలు గవర్నర్‌ కి సమర్పించేందుకు జగన్ మోహన్‌ రెడ్డి వెళుతుంటే వెల్లువలా తరలివచ్చిన జనాన్ని చూస్తేనే అర్థం అయిపోయింది. అంతే పవన్ యజమాని చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే రంగంలోకి దించాడు. మీకు మేత అందింది. ఇక కూతకు సిద్ధమైపోయారు.

అందుకే రెచ్చగొడుతున్న పవన్

అందుకే పవన్‌ కల్యాణ్‌ నన్ను తిట్టండి నన్ను తిట్టండి అని వైసీపీ వాళ్లని ఏదో రకంగా రెచ్చగొట్టేందుకు నానా ఆపసోపాలూ పడిపోతున్నారు. దేబిరించే పరిస్థితికి వచ్చేశారు. కానీ ఫలితం రావడం లేదు. ఏవరైనా నీ గురించి మాట్లాడితే – అదిగో నన్ను తిట్టేశారు అని ఏడ్చి పెడబొబ్బలు పెట్టి సింపథీ కొట్టేయాలని కాపు కాసి మరీ ఈ కథలుచెప్తున్నారు. అసలు పవన్‌కల్యాణ్‌ సమస్య ఏంటో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. పదవి బాధ్యత పేరుతో సమావేశం పెట్టి మరీ ఆయన గందరగోళాన్ని బయటపెట్టుకున్న తీరును మనం ఓసారి చూద్దాం. ప్రైవేటు సెటిల్మెంట్లు చేయాల్సి వస్తే జాగ్రత్తగా చేయాలట! అదేంటి? ప్రైవేటు సెటిల్మెంట్లు చేయడం ఏంటి? జాగ్రత్తగా చేయాలని చెప్పడం ఏంటి ?

ఎవరి కోసం భయపడుతున్నారు?

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు భయపడుతున్నారట ! వాళ్లు ఎవరి కోసం పని చేస్తున్నారు? ఎవరితో పని చేస్తున్నారు? పవర్‌ లో ఉన్నది ఎవరు? మరి భయపడుతున్నారు అంటే కారకులు ఎవరు? మీ అధికారం చూసి పక్కనున్న అధికారులకే భయం వేస్తోందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నట్టు? పవన్‌కల్యాణ్‌ కూటమి ఇంటి గుట్టును ఆయనే బయటపెట్టుకున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ ని చేతిలోకి తీసుకోవాలట! ఇదేంటి మళ్లీ? ఒకాయనేమో ఎర్రపుస్తకం, రెడ్‌ బుక్‌ అంటాడు. పవన్ ఏమో లా అండ్‌ ఆర్డర్‌ చేతిలోకి తీసుకోవాలి అంటున్నారు. పైగా రౌడీయిజాన్ని సహించను అని చెబుతున్నారు. ఏమిటీ కన్ఫ్యూజన్?

ప్రత్యేక విమానాల్లో చక్కర్లు

స్పెషల్‌ ఫ్లైట్‌లో రెండు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టడం, ఇదిగో ఇలా చంద్రబాబుకి కావాల్సి వచ్చినప్పుడల్లా సింపథీ డ్రామా చేయడం తప్ప పవన్ సాధించింది ఏముంది ఈ 18 నెలల కాలంలో? నమ్మి ఓటు వేసిన వాళ్ల కోసం – ఇది చేశాను ఇది సాధించాను అని చెప్పడానికి ఏమైనా ఉందా? పైగా మరో 60 మందికి నామినేషన్‌ పదవులు ఇవ్వండి అని ప్రతిపాదనలు పంపాను చంద్రబాబుకి అని చెప్పే స్థాయికి పడిపోయారు.

ఆత్మగౌరవం అడుగంటిందా?

ఆత్మగౌరవం అడుగంటి పోయి, సిగ్గు చితికిపోయిందనడానికి  ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? నిన్ను నమ్మి నీ పార్టీ కోసం పని చేసిన వాళ్లకి పదవులు ఇవ్వాలంటే నువ్వు ఎవరినో అడగాలి. అడుక్కోవాలి. పైగా తండ్రిని నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఉంటారు అని ఏవేవో డైలాగులు పేలుతున్నావు కదా ! మీ కూటమి యజమాని చంద్రబాబు మామగారిని నమ్మించి, పోటు పొడిచి వచ్చాడు. నువ్వేమో అన్న పేరు చెప్పి సినిమాలు చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మరి మీరు వారసత్వం గురించి మాట్లాడ్డం ఏంటి?. జగన్‌ ఎవరో పార్టీని పెట్టుకుని అధికారంలోకి రాలేదే. తనకు తాను సొంతపార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అది కూడా ఏ పొత్తు లేకుండానే.. ఒక్కడిగానే వచ్చారు. ఇదీ వాస్తవం. మరి ఎవరిది వారసత్వ రాజకీయం? సొంతంగా పార్టీ పెట్టి, సొంత జెండాతో, అజెండాతో సింగిల్‌గా పోటీ చేసి, గెలుపు జెండా ఎగరేసి, ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర ప్రజల గుండెల్లో వేసిన ఏకైక మొనగాడు వైయస్ జగన్. అలాంటి నేత గురించా మీరు మాట్లాడేది!

ఎవరినో అడగాల్సినదీన స్థితిలో పవన్

పవన్‌ పార్టీ పెట్టారు. కార్యకర్తలకి పదవులు ఇవ్వాలంటే ఎవరినో అడిగేస్థాయలో ఆయన ఉన్నారు. ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. పైగా గ్రామీణాధివృద్ధి లాంటి కీలక శాఖ ఇచ్చారు. జీరాంజీ పేరుతో కేంద్రం కొత్త పథకం తెచ్చింది. ఉన్న పథకాన్ని పక్కన పెట్టింది. ఉపాధి హామీ రూల్స్‌ మార్చింది. దీనికి టీడీపీతో పాటు, మీరు కూడా మద్దతు ఇచ్చారు. మరి ఏపీ మీద ఆ పథకం దెబ్బతో రూ.4 వేల కోట్ల భారం పడుతుంది. మరి ఆ భారాన్ని భరించడం ఎలా  లోటు పూడ్చడం ఎలా? ఏదైనా ఆలోచించారా? ఇది కదా నీ బాధ్యత? పైగా మన రాష్ట్రంలో 18 లక్షల జాబ్‌ కార్డులు తీసేశారు. అంటే ఎంత మంది నోటి దగ్గర కూడు పోయిందో అర్థం అవుతోందా? ఎన్ని అవస్థలు పడతాయో తెలుస్తోందా? అలాంటివి ఎప్పుడైనా ఆలోచించారా?  జనం సమస్యలు, నీవు చేయాల్సిన బాధ్యతలు వదిలేసి ఉత్త డాంబికాలు, ఏదో రకంగా ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తే అదిగో నన్ను తిట్టేశారు అని ఏడ్చి పెడబొబ్బలు పెట్టి – పబ్లిసిటీ పొందాలని, చంద్రబాబు అప్పగించిన డైవర్షన్‌ స్కీమ్‌ని ఇంప్లిమెంట్‌ చేయాలని చూస్తారెందుకు? స్పెషల్‌ ఫ్లైట్‌లో తిరగడానికి నీకో పదవి, చంద్రబాబు వాడుకోడానికి నీకో పార్టీ, టీడీపీ జెండాలు మోయించడానికి నీ అనుచరుల భుజస్కందాలు, కులం పేరుతో, కుట్రల పేరుతో తప్పుడు రాజకీయాలు. ఇంకెన్నాళ్లు?. ఇలా చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు ఎన్నాళ్లు కాపు కాస్తారు? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లను ఎంతకాలం మోసం చేస్తారు? అని వైయస్సార్ సీపీ ప్రశ్నించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment