బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9)కు తెరపడింది. సోషల్ మీడియాలో ఓ పేరు హోరెత్తిపోతోంది. అదే కళ్యాణ్ పడాల (Kalyan Padal). బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా (Winner) కళ్యాణ్ పడాల నిలిచాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త కళ్యాణ్ ఫ్యాన్స్‌ను సంబరాల్లో ముంచెత్తుతోంది.
కామనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల.. ఇప్పుడు విజేతగా నిలిచాడు. “కామనర్ కప్పు గెలిచాడు” (Commoner Won the Trophy) అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లతో సంబరాలు మొదలుపెట్టారు. ప్రేక్షకుల మద్దతుతో చివరి వరకూ దూసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
ఫినాలే వరకు తనూజ, కళ్యాణ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరి దశలో ఇద్దరి మధ్య కేవలం స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందని, ఆ తేడాతోనే కళ్యాణ్ విజేతగా నిలిచారు. దీంతో తనూజ (Tanuja) రన్నరప్‌గా (Runner-up) నిలిచింది. ఈ వార్తతో కళ్యాణ్ అభిమానులు నెట్టింట పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
కళ్యాణ్ ప్రయాణం మాత్రం అంత సులువు కాదు. ఫస్ట్ కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు తొలి మూడు వారాలు తీవ్ర నెగిటివిటీ ఎదురైంది. విమర్శలు, ట్రోల్స్ అన్నింటినీ ఎదుర్కొన్న కళ్యాణ్… నాలుగో వారం నుంచి పూర్తిగా తన ఆటతీరును మార్చాడు. టాస్కుల్లో దూకుడుగా ఆడుతూ, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ తన గ్రాఫ్‌ను రోజు రోజుకూ పెంచుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
టాస్కుల్లో ప్రదర్శించిన చాకచక్యం, మాటల్లో స్పష్టత, ప్రవర్తనలో పరిపక్వత ఆయనను విన్నర్ రేసులో ముందుకు నెట్టాయి. తనూజ, ఇమ్మాన్యుయేల్‌లతో గట్టి పోటీ ఇస్తూ చివరకు ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్… ఇప్పుడు బిగ్ బాస్ కప్పును సొంతం చేసుకున్నాడన్న వార్త అభిమానులను ఉత్సాహంతో ఉర్రూతలూగిస్తోంది. వేలాది మంది ఆశావహులను దాటి, కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన కళ్యాణ్ కథ… నిజంగానే బిగ్ బాస్ చరిత్రలో ఓ మైలురాయే.








