నువ్వు సూపర్ బ్రో.. ఆ కెమెరామెన్‌ను హ‌గ్ చేసుకున్న హార్దిక్

నువ్వు సూపర్ బ్రో.. ఆ కెమెరామెన్‌ను హ‌గ్ చేసుకున్న హార్దిక్

అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన ప్రత్యేకతను చాటాడు. భారీ షాట్లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించడమే కాదు.. తన మంచి మనసుతోనూ కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

మ్యాచ్ సమయంలో హార్దిక్ బాదిన ఓ భారీ సిక్స్ నేరుగా స్టేడియంలోని డగౌట్ పక్కన కెమెరా నిర్వహిస్తున్న కెమెరామెన్‌ను (Cameraman) తాకింది. బంతి బలంగా తగలడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. వెంటనే వైద్యులు రంగంలోకి దిగి చికిత్స అందించారు.

అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా అక్కడికి వెళ్లి కెమెరామెన్ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నాడు. ఆప్యాయంగా హగ్ చేసుకొని (Hugged) ధైర్యం చెప్పాడు. అంతేకాదు, బంతి తగిలిన ఎడమ భుజంపై ఐస్ ప్యాక్ పెట్టి తానే సహాయం చేయడం అందరి మనసులను కదిలించింది. ఈ సంఘటనతో “నువ్వు నిజంగా సూపర్ బ్రో” అంటూ సోషల్ మీడియాలో హార్దిక్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

ఈ మ్యాచ్‌లో భారత్ (India) 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా (South Africa)పై ఘన విజయం సాధించింది. ఈ విజయంలో హార్దిక్ పాత్ర అత్యంత కీలకం. 13వ ఓవర్లో భారత్ 115/3 స్కోర్ వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్, తొలి బంతినే సిక్సుగా మలిచి తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటాడు.

కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, టీ20ల్లో భారత ఆటగాళ్లలో రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు. చివరికి 25 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మ (Tilak Varma)తో కలిసి 45 బంతుల్లో 105 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ వర్మ 73 పరుగులు చేయగా, వారి జోడీ భారత్‌ను 231 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment