సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి జిల్లాల్లోనే అధిక నేరాలు!

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి జిల్లాల్లోనే అధిక నేరాలు!

రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and Order) పరిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో రాష్ట్ర పోలీసు శాఖ అధికారిక నివేదిక బ‌య‌ట‌పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) సొంత జిల్లా తిరుపతి (Tirupati District), ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా (Kakinada District), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాల్లోనే (Guntur District) నేరాలు భారీగా పెరగడం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్‌తో పోలిస్తే, 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దోపిడీలు, ముఖ్యంగా ఆర్థిక నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీసు నివేదిక స్పష్టం చేసింది.

శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తున్న వాస్తవాన్ని అధికారిక గణాంకాలు బయటపెట్టాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన రెండో రోజు సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించి ఈ నివేదికను సమర్పించారు. అందులో కీలకంగా పది జిల్లాల్లో నేరాల తీవ్రత స్పష్టంగా పెరిగినట్టు పేర్కొన్నారు. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. ఈ జిల్లాల్లో ఆరు చోట్ల 4.8 శాతం నుంచి 9.5 శాతం వరకు నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

నేరాల స్వరూపం మరింత భయానకంగా మారిందని నివేదిక వెల్లడించింది. దాడులు, హత్యాయత్నాలు గణనీయంగా పెరిగాయి. 2024లో కేవలం 13 దాడుల కేసులు నమోదవ్వగా, 2025లో అవి 19.8 శాతం పెరిగి 157 కేసులకు చేరాయి. అలాగే 2024లో 1,291 హత్యాయత్నాలు జరగ్గా, 2025లో అవి 1,582కు పెరిగాయి. అంటే హత్యాయత్నాలు ఏకంగా 22.5 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా వైఎస్సార్ కడప, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని పేర్కొంది.

పట్టపగలు దోపిడీలు, వాటిలో హత్యలు కూడా పెరిగాయని నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, మాదకద్రవ్యాల వ్యాప్తి కూడా అదుపు తప్పుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 2025లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,139 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదు కావడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో సూచిస్తోంది. ఈ గణాంకాలు రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment