కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ముఖ్యమంత్రి (Chief Minister) సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) డి.కె.శివకుమార్ (D.K. Shivakumar) మధ్య కొంతకాలంగా నడుస్తున్న ‘పవర్ షేరింగ్’ (Power Sharing) వివాదం ప్రస్తుతం ‘బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు’ (Breakfast Politics)గా మారింది. మొన్నటిదాకా హస్తిన (ఢిల్లీ) వేదికగా హైకమాండ్‌తో చర్చలు జరిపిన ఈ ఇద్దరు నేతలు, రాష్ట్రంలో ఐక్యతను ప్రదర్శించేందుకు వ్యక్తిగత భేటీలు నిర్వహిస్తున్నారు.
గత శనివారం రోజున సిద్ధరామయ్య ఇంట్లో డి.కె.శివకుమార్ అల్పాహారం తీసుకోగా, తాజాగా మంగళవారం ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఇంట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ భేటీ ద్వారా ఇద్దరు ముఖ్య నాయకులు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేయాలని చూస్తున్నారు.
తాజాగా సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే డీకే అప్పుడు సీఎం అవుతారని, సీఎం మార్పుపై హైకమాండ్ దే తుది నిర్ణయం అని ప్రస్తుత సీఎం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
డీకే శివకుమార్ ఇంట్లో నాటుకోడి చికెన్, ఇడ్లీలను రుచి చూసిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం ఐక్యంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. డిసెంబర్ 8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రతిపక్షాలను సమష్టిగా ఎదుర్కోవాల్సిన విధానాలపై చర్చించినట్లు తెలిపారు.
తాము కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ఎమ్మెల్యేలందరూ కూడా ఐక్యంగా ఉన్నారని ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా, పవర్ షేరింగ్ వివాదానికి తెరదించినట్లు సంకేతాలు ఇచ్చారు.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు