నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. అది ఎవరి మీదో కాదు.. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ సమంత (Samantha)పైనే అని ఫ్యాన్స్ నిర్దారించారు.
“నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా. ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత గల మనిషి. డబ్బు ఉంటే బలహీనమైన, ఆశపడే పురుషులు చాలా మంది వస్తారు” అని పూనమ్ (Poonam) ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఆమె ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ, దీని టైమింగ్, పరోక్ష సూచనల కారణంగా ఈ విమర్శలు సమంత రూత్ ప్రభును లక్ష్యంగా చేసుకున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో, పూనమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీశాయి.
డిసెంబర్ 1న సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ ట్వీట్ వచ్చింది. రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని, సమంతతో సంబంధం మొదలైన తర్వాతే తన మొదటి భార్య శ్యామలాదేవికి విడాకులు ఇచ్చారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే పూనమ్ కౌర్ (Poonam Kaur) వ్యాఖ్యలు రావడంతో, “సమంత పెళ్లి కోసం మరొక కుటుంబం పాడైందా?”, “శ్యామలాదేవి (Shyamaladevi) పరిస్థితి ఏమైంది?” అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పూనమ్ కౌర్ ప్రతి ట్వీట్ లాగే, ఈ తాజా వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చను రాజేశాయి. దీనిపై సమంత లేదా ఆమె టీమ్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.








