జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (By-elections) కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ (V. Naveen Yadav) భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అధికారికంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా (MLA) ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు.

అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ వేడుకలో స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్‌ సమక్షంలో నవీన్ యాదవ్ తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. అనంతరం స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి న‌వీన్ యాద‌వ్ తండ్రితో స‌హా కుటుంబ స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు. మంత్రి శ్రీ‌ధ‌ర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక నాయకులు హాజ‌ర‌య్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment