గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

ఇటీవ‌ల మ‌న్యం (Manyam) జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంటున్న ప‌చ్చ కామెర్ల మ‌ర‌ణాలు, విష జ్వ‌రాల‌పై గిరిజ‌న (Tribal) సంక్షేమ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. పిల్ల‌ల‌కు జ్వ‌రం వ‌స్తే నా బాధ్య‌తా అని చేసిన కామెంట్స్‌పై గిరిజ‌న ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గిరిజ‌న మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) తీరుపై విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గిరిజన ప్రాంత జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. మన్యం జిల్లాలో వ్యాధులు, పచ్చకామెర్ల కారణంగా మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజ‌న మంత్రిని చుట్టుముట్టి, ప్రభుత్వం గిరిజన ప్రాంతాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సంబంధిత శాఖ మంత్రిగా మీ స‌మాధానం ఏంట‌ని జడ్పీటీసీలు ఆందోళ‌న‌కు దిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై శ్రద్ధ తగ్గిందని వారు మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణిని జడ్పీటీసీలు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత తగ్గింది.

Join WhatsApp

Join Now

Leave a Comment