కోర్టు ఆదేశాల‌తో TV5 మూర్తిపై క్రిమినల్ కేసు!

కోర్టు ఆదేశాల‌తో TV5 మూర్తిపై క్రిమినల్ కేసు

హైదరాబాద్‌లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా వ్యక్తి TV5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. త‌న‌ను బ్లాక్ మెయిల్ చేసి TV5 మూర్తి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడ‌ని నటుడు ధర్మ సత్యసాయి మహేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత వివరాలను టెలికాస్ట్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని మహేష్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఆయన కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాలపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

మహేష్‌ తన ఫిర్యాదులో.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సేకరించి, వాటిని టెలివిజన్‌లో ప్రసారం చేస్తానని బెదిరింపులు వస్తున్నాయని తెలిపాడు. TV5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు, డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ ప్రయత్నం చేశాడని మహేష్‌ పేర్కొన్నారు. తన వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనతో పాటు, అపకీర్తి కలిగించే విధంగా మూర్తి వ్యవహరించాడని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, నటుడు మహేష్‌ భార్య గౌతమి చౌదరి, తన భర్తతో ఉన్న విభేదాల నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో TV5 మూర్తితో కలిసి ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో, మహేష్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు గౌతమి చౌదరిని A1గా, TV5 మూర్తిని A2గా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

ప్రస్తుతం ఈ కేసు చుట్టూ మీడియా వర్గాల్లో చర్చలు రేగుతున్నాయి. ప్రముఖ మీడియా జర్నలిస్టుపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం సెన్సేషన్‌గా మారింది. కూకట్‌పల్లి పోలీసులు కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించగా, TV5 మూర్తి, గౌతమి చౌదరి పక్షాల నుంచి ఇంకా స్పందన రాలేదు. ఈ ఘటనపై రానున్న రోజుల్లో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment