నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం.. లైసెన్స్ రద్దు

నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం.. లైసెన్స్ రద్దు

ఏపీలో మందుబాబులను వణికిస్తున్న నకిలీ మద్యం కేసు రోజురోజుకూ మరిన్ని సంచలన అంశాలను బయటపెడుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ మద్యం విక్రయాలు జరిపిన శ్రీనివాస వైన్స్ లైసెన్స్‌ను ఎక్సైజ్ అధికారులు ర‌ద్దు చేశారు.

ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యం తెచ్చి శ్రీనివాస వైన్స్‌లో విక్రయాలు జరిపినట్టు విచారణలో తేలింది. ఈ వైన్స్‌లో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు భాగస్వామిగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. గత నెల 7వ తేదీన ఈ వైన్స్ షాపులో సుమారు 3,500 నకిలీ మద్యం బాటిల్స్ విక్రయించగా, దాదాపు రూ.3 లక్షలకు పైగా లాభం వచ్చినట్టు రికార్డులు చూపిస్తున్నాయి.

శ్రీనివాస వైన్స్ లైసెన్స్ మహంకాళి పూర్ణచంద్రరావు పేరుతో ఉన్నట్టు నిర్ధారించగా, ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టే ముందు నిందితుడు కళ్యాణ్ 60 కర్టాన్ల నకిలీ మద్యం సీసాలను పారబోసినట్టు బయటపడింది. ఈ ఘటనతో రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాపారంపై మరోసారి దృష్టి సారించిన అధికారులు, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment