భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) కు మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర కేబినెట్ (Cabinet) విస్తరణలో భాగంగా ఆయన నేడు (అక్టోబర్ 31) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ (Raj Bhavan)లో గవర్నర్ (Governor) జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) సమక్షంలో మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు ఇతర మంత్రులు ఈ వేడుకకు హాజరై అజహరుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం కేవలం ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజహరుద్దీన్‌కు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన అభ్యర్థులు గెలవకపోవడంతో, ఆ సంప్రదాయాన్ని నిలబెట్టేందుకు ఈ అవకాశం కల్పించారు.
గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయిన అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినా, గవర్నర్ నుంచి నియామకానికి ఇంకా ఆమోదం రాలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం. అయితే, ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కీలక శాఖల్లో ఒకటి కేటాయించనున్నారని సమాచారం.








