ఆర్థిక, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బ‌తుకీడుస్తున్న మాజీ క్రికెట‌ర్‌

ఆర్థిక, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బ‌తుకీడుస్తున్న మాజీ క్రికెట‌ర్‌

భారత మాజీ క్రికెటర్, సచిన్ టెండుల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ప్రస్తుతం నెలకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తోనే తన కుటుంబాన్ని పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు.

యూరిన్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాన‌ని, కుటుంబం సాయంతో ప్రస్తుతం కొంతమేర కోలుకుంటున్నాన‌ని వివ‌రించారు. గతంలో సచిన్ త‌న వైద్య చికిత్స కోసం సాయం చేశారని గుర్తుచేసుకున్నారు. అలాగే, కపిల్ దేవ్ ఇచ్చిన ఆఫర్ మేరకు రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు కాంబ్లీ.

వినోద్ కాంబ్లీ గతంలో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించినా, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల‌తో బతుకు పోరాటం సాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment