పుష్ప2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. బన్నీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారన్న రూమర్ చక్కర్లు కొడుతుంది. అందుకే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారని, త్వరలోనే బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారన్న పుకార్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
బన్నీ టీమ్ అధికారిక ప్రకటన..
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రానున్నారని సోషల్ మీడియా నుంచి కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వరకు వార్తలు విస్తరించాయి. అయితే అల్లు అర్జున్ టీమ్ ఈ విషయం మీద స్పష్టమైన ప్రకటన చేసింది. “ఇవి పూర్తిగా తప్పుడు వార్తలు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు, ఆ వార్తలను నమ్మకండి. ఇలాంటి నిరాధార వార్తల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే మేమే ప్రత్యక్షంగా వెల్లడిస్తాం” అని బన్నీ టీమ్ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది.