ఏపీలో భారీ వ‌ర్షాలు.. దుబాయ్ నుంచి సీఎం టెలీకాన్ఫ‌రెన్స్‌

ఏపీలో భారీ వ‌ర్షాలు.. దుబాయ్ నుంచి సీఎం టెలీకాన్ఫ‌రెన్స్‌

బంగాళాఖాతం (Bay of Bengal)లో సుస్ప‌ష్ట అల్ప‌పీడనం (Low-Pressure) కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దుబాయ్ (Dubai) ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ (Teleconference)  నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితిని సమీక్షించిన సీఎం, మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆర్టీజీఎస్ అధికారులతో నేరుగా మాట్లాడి అవసరమైన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

వర్షాలతో తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్న నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితులపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి, వెంటనే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, అలాగే మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలి అని సూచించారు. అలాగే, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కాలువలు, చెరువుల గట్లను పటిష్టం చేసి గండ్లు పడకుండా చూడాలని, విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు.

పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్లు సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment