మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (అక్టోబర్ 23) అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 24 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)తో కలిసి క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన కెరీర్‌లో 59వ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే, హిట్‌మ్యాన్ 74 బంతుల్లో అర్ధ శతకాన్ని చేరుకోవడం విశేషం. ఇది రోహిత్ కెరీర్‌లోనే అత్యంత స్లోయెస్ట్ (నెమ్మదైన) (Slowest) హాఫ్ సెంచరీ (Half Century)గా నమోదైంది. 2015 తర్వాత రోహిత్ ఇన్ని బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి. అలాగే, ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో రికార్డు కూడా సృష్టించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా అతను నిలిచాడు.
మరోవైపు, ఈ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో రెన్‌షాకు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కనోలీ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో విరాట్ పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమ్మిన్స్ సారథ్యం వహిస్తున్నారు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’