మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎంపిక అవుతారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే, చిరంజీవి స్వయంగా ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే ఈ విషయంపై కీలక చర్చలు జరిపారని, అన్ని అంశాలు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే నాగబాబును రాజ్యసభ స్థానానికి కాకుండా, ఏపీ కేబినెట్ పదవికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అవుతారా? లేదా, రాజకీయ రంగంలో మరో కీలక మలుపు తిరుగుతుందా..? అనే ఆసక్తికర చర్చలు ఇప్పుడు అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తున్నాయి.