అనంతపురంలో గ్యాంగ్ వార్‌.. యువ‌కుడి ప‌రిస్థితి విష‌మం (Video)

అనంతపురంలో గ్యాంగ్ వార్‌.. యువ‌కుడి ప‌రిస్థితి విష‌మం (Video)

అనంతపురం జిల్లాలో గ్యాంగ్ వార్ క‌ల‌క‌లం రేపింది. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే ఓ యువ‌కుడిని బండ‌రాళ్ల‌తో, ఇనుప రాడ్ల‌తో విచక్ష‌ణార‌హితంగా దాడి చేయ‌డం స్థానికంగా భ‌యాందోళ‌న‌లు రేకెత్తించింది.

వివ‌రాల్లోకి వెళితే.. అనంత‌పురం బిందెలకాలనీలో నివసించే నాగరాజు, అతని అల్లుడు గుణ మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. స్థానికంగా రాజకీయ ఆధిపత్యం కారణంగా వీరి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నాగరాజుపై గుణ దాడి చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. నాగరాజును చంపేందుకు యత్నించిన గుణపై అనంతరం నాగరాజు అనుచరులు ప్రతిదాడి చేపట్టారు.

గుత్తి-అనంతపురం రహదారిపై బైక్‌పై వెళ్తున్న గుణపై నాగరాజు వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, రాడ్లతో గుణను తీవ్రంగా కొట్టడంతో అతను ర‌క్త‌గాయాల‌తో అక్కడికక్కడే స్పృహ‌త‌ప్పి ప‌డిపోయాడు. స్థానికులు వెంటనే గుణను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారిపై బహిరంగంగా జరిగిన ఈ దాడి అనంతపురం ప్రజల్లో కలకలం రేపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment