రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ వద్ద అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు (Kurnool) జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొనే సభ ప్రాంగణం వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రధాన సభకు హాజరైన అర్జున్ (Arjun) అనే వ్యక్తి దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ (Electric Shock)కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారం ప్రకారం, మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్ పీఎం సభకు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఇనుప రాడ్‌తో ఉన్న జెండా కరెంట్ తీగకు తగిలింది. దాంతో అర్జున్ తీవ్రంగా షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. వెంటనే వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో సభ ప్రాంగణంలో కలకలం రేగింది. మరికాసేపట్లో జరిగే ప్రధాని మోదీ సభకు ముందే ఈ ఘటన జరగడంతో అధికారులు, ఆహుతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ లైన్ల భద్రతపై సంబంధిత శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.








