“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” – ఎస్పీకి పేర్ని నాని కౌంట‌ర్‌

“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” - ఎస్పీకి పేర్ని నాని కౌంట‌ర్‌

పోలీసులు (Police) వ్యవహారిస్తున్న తీరుపై కృష్ణా జిల్లా వైసీపీ (YSRCP) అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కిందస్థాయి అధికారుల వాదనలకే ఆధారపడి ఎస్పీ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. “ఎస్పీ (SP)  స్టేషన్‌ (Station)లోని సీసీ ఫుటేజ్‌ (CC Footages)లు చూసి వాస్తవాలు తెలుసుకోవాలి” అని సూచించారు.

పేర్ని నాని మాట్లాడుతూ – “మా పార్టీ నాయకుడు మేకల సుబ్బన్న (Mekala Subbanna)ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లడంతో, ఆయన భార్య నాకు ఫోన్ చేశారు. ఆయన కోసమే నేను స్టేషన్‌కు వెళ్లాను. మేమెవ్వరూ గొడవ చేయలేదు. కానీ అక్కడ సిఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాతో అవమానకరంగా ప్రవర్తించారు. ‘మీకు చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ తూలనాడారు” అని చెప్పారు.

“మేము పోలీసుల శత్రువులం కాదు. కానీ అధికారులు పోలీస్ డ్రెస్ వెనుక దాక్కొని రాజకీయ కక్షలు తీర్చుకుంటే ప్రశ్నించక తప్పదు. ఇదే సత్యం. గతంలో ఒక దళిత యువకుడిని కేవలం సోషల్ మీడియా పోస్టు పెట్టాడని 10 రోజులపాటు జైలులో పెట్టారు. మా నాయకులపై కూడా సిఐ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మగౌరవానికి విరుద్ధం” అని నాని తీవ్రంగా స్పందించారు.

అలాగే, ఆయన ఎస్పీకి విజ్ఞప్తి చేస్తూ “వాస్తవాలు తెలుసుకోండి. ఎవరి మాటలు విని నిర్ణయం తీసుకోకండి. నా మీద కేసులు పెట్టాలంటే పెట్టండి. నేను నేరం చేయలేదు. కానీ మమ్మల్ని అవమానిస్తే నిశ్శబ్దంగా కూర్చోను. మా నాయకుల ఆత్మగౌరవం కోసం పోరాడుతాను,” అన్నారు. మ‌చిలీప‌ట్నంలో సెక్షన్ 30 రోజూ అమల్లో ఉంచి ప్రజల నిరసన హక్కును ఎలా అడ్డుకుంటారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది అని పేర్ని నాని పోలీసుల వైఖ‌రికి కౌంట‌ర్ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment