రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ జట్టుకు సారథిగా ఎంపిక కాగా, రాహుల్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
తిలక్ వర్మ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన కారణంగా, హైదరాబాద్ ఆడబోయే తొలి మ్యాచ్ (అక్టోబర్ 15-18, ఢిల్లీతో)కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా ఈ సీజన్‌కు పూర్తిగా దూరంగా ఉండనున్నాడు. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది.
హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).







