డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr.B. R.Ambedkar) జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) సంభవించింది. రాయవరం (Rayavaram) ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఆరుగురు కార్మికుల సజీవ దహనమయ్యారు. రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్వర్క్స్ యూనిట్ (Lakshmi Ganapati Fireworks Unit)లో బాణాసంచా తయారీ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బాణాసంచా ముడి పదార్థాలు ఒక్కసారిగా మంటలంటుకోవడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) October 8, 2025
కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
మంటల్లో ఆరుగురు సజీవదహనం..
రాయవరం బాణసంచా కేంద్రంలో చెలరేగిన మంటలు
పలువురికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు.. కొనసాగుతున్న సహాయక చర్యలు pic.twitter.com/Is4CjjhOLQ







