హైదరాబాద్ (Hyderabad) ప్రజలు, రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికకు (By-Election) సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీని ప్రకటించింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 14న ఓట్లు లెక్కించబడతాయి. ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ కానుండగా, నామినేషన్ దాఖలుకు ఈనెల 21 వరకు గడువు ఉంది.
ఈ ఉపఎన్నికలు బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో అనివార్యం అయ్యాయి. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్యను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సి.ఎన్. రెడ్డి పేర్లను అధిష్టానం సిఫార్సు చేసినట్లు సమాచారం. సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ టికెట్ కోసం ఆశించినా చివరకు నిరాశ తప్పదన్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు అతి త్వరలోనే అధిష్టానం రివీల్ చేయనుంది.
బీజేపీ కూడా జూబ్లీహిల్స్ నుంచి తమ అభ్యర్థి ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీగా తాము సకాలంలో తగిన నిర్ణయం తీసుకుని బరిలో ఎవరిని పెట్టాలో నిర్ణయించనున్నారు. ఈ ఉపఎన్నిక కోసం తెలంగాణ సమాజం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.







