అమరావతి (Amaravati) ప్రాంత రైతుల (Farmers) ఇబ్బందులు అసెంబ్లీ (Assembly)లో మరోసారి ప్రతిధ్వనించాయి. ఎమ్మెల్యే తెనాలి (Tenali) శ్రావణ్ కుమార్ (Shravan Kumar) మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ (Land Pooling) కింద రైతులు దాదాపు 33,500 ఎకరాల భూమి ఇచ్చారని, అయితే వారిలో చాలామంది ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్లు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ఇచ్చిన ప్లాట్లు ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వని రైతుల పొలాల్లో ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ కారణంగా రైతులు తొమ్మిది సంవత్సరాలుగా సీఆర్‌డీఏ ఆఫీసుల (CRDA Office) చుట్టూ తిరుగుతున్నారని వివరించారు.
అసైన్డ్ రైతులు (Assigned Farmers) ఇచ్చిన 4 వేల ఎకరాలకు పైగా భూముల సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదని శ్రావణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి నిర్వాకంతో భూములు అమ్ముకున్నారని, కొన్నారని సిట్ విచారణ జరిపి పూర్తి చేసినప్పటికీ, ఇప్పటికీ వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని, కౌలు సదుపాయం కూడా లేదని సభ దృష్టికి తెచ్చారు. సీఆర్‌డీఏ అధికారులు రైతుల గ్రీవెన్సులు విన్నప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు గౌరవం కూడా ఇవ్వకుండా, ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చిన భూములకు రికగ్నిషన్ పత్రాలు ఇచ్చినప్పటికీ ప్లాట్లు కేటాయించడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. పలుమార్లు అడిగితే లిస్ట్ కలెక్టరేట్‌కి వెళ్లిందని, ట్యాలీడ్-నాన్ ట్యాలీడ్ లిస్ట్‌లో ఉందని మాత్రమే చెబుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలలుగా ఈ సమస్యపై పదేపదే అడుగుతున్నా పరిష్కారం రాకపోవడం రైతులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రావణ్ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.








