ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) తన వివాదాస్పద వ్యాఖ్యలను (Controversial Comments) ఉపసంహరించుకున్నారు (Withdrew). మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సమావేశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో వైసీపీ శ్రేణులు, మెగా అభిమానులు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో పాటు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై నిరసనలు, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల మధ్య కామినేని చివరికి వెనక్కి తగ్గారు.
అసెంబ్లీ రికార్డుల (Assembly Records) నుంచి తన వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్‌కి కామినేని విజ్ఞప్తి చేశారు. ‘‘మొన్న నేను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయని భావిస్తున్నాను. అందుకే రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా’’ అని తెలిపారు. జగన్ సినీ ప్రముఖులకు గౌరవం ఇవ్వలేదని కామినేని అసెంబ్లీలో చెప్పిన మాటలు రాజకీయ తుఫాన్ రేపగా, చిరంజీవి స్వయంగా స్పందించి తనను మాజీ సీఎం వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారని స్పష్టం చేశారు. దీంతో కామినేని మాటలు అబద్ధమని బహిరంగంగా బయటపడింది.
ఈ వివాదం కారణంగా బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలూ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. వైసీపీ శ్రేణులు ఆయనను టార్గెట్ చేయగా, మెగా అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన మాత్రం ఈ వ్యవహారంపై మౌనం పాటించగా, టీడీపీ వర్గాలు కూడా స్పందించకపోవడం గమనార్హం. మొత్తంగా కామినేని మాటలు ఆయనను బలహీన స్థితిలోకి నెట్టేశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.







