తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు

Summarize with AI

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తాజాగా ఆరుగురు IAS అధికారులను, 23 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ స్థాయి బదిలీల్లో హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనర్‌ (Police Commissioner)గా వీసీ సజ్జనార్‌ (V.C.Sajjanar) నియమితులయ్యారు. గతంలో ఈ పదవిలో ఉన్న సీవీ ఆనంద్‌ (C.V.Anand)ను హోంశాఖ సెక్రెటరీగా నియమించారు.

ముఖ్యమైన నియామకాలు:
తెలంగాణ డీజీపీ: బత్తుల శివధర్‌రెడ్డి

హైదరాబాద్ పోలీస్ కమిషనర్: వీసీ సజ్జనార్‌

హోంశాఖ సెక్రెటరీ: సీవీ ఆనంద్

ఇంటెలిజెన్స్ డీజీ: విజయ్ కుమార్

ఆర్టీసీ ఎండీ: నాగిరెడ్డి

విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ & సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్: శిఖా గోయల్

ఫైర్ వింగ్ డీజీ: విక్రమ్ సింగ్ మాన్

సీఐడీ చీఫ్: వీవీ శ్రీనివాసరావు

ఏసీబీ డీజీ (అదనపు బాధ్యతలు): చారుసిన్హా

ఇటీవల వివాదాస్పదంగా మారిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హరితను కొత్త సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment