చిత్తూరు జిల్లా (Chittoor District)లో ఓ మహిళ (Woman) చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. న్యాయం (Justice) కోసం పోలీస్ స్టేషన్ (Police Station) మెట్లు ఎక్కిన తనకు కానిస్టేబుల్ (Constable), హోం గార్డు (Home Guard)ల నుంచే వేధింపులు ఎదురయ్యాయని బాధితురాలు మీడియా ముందుకు వచ్చి కన్నీరు మున్నీరుగా తన గోడును చెప్పుకుంది.
పలమనేరు మండలం గంటావూరుకు చెందిన షబ్రీన్ (Shabreen) అనే మహిళ, కానిస్టేబుల్ ఉమాశంకర్, హోం గార్డు కిరణ్ కుమార్(Kiran Kumar) లపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుటుంబ సమస్య గురించి సాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళితే తనను లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురి చేస్తున్నారని తెలిపింది. గతంలో కానిస్టేబుల్ ఉమాశంకర్ (Umashankar) కూల్‌డ్రింక్‌లో మత్తుమందు (Intoxicant) కలిపి తనపై అత్యాచారం(Rape) చేశాడని షబ్రీన్ ఆరోపించింది. ఈ విషయం బయటపెడితే తన ముగ్గురు పిల్లలను చంపేస్తానని బెదిరింపులు కూడా చేశాడని వాపోయింది.
తాను ఇప్పటికే ఈనెల 13న చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పలమనేరు పోలీసులు తన గోడు వినకపోగా, బంగారుపాళెం పోలీస్ స్టేషన్‌కి వెళ్లమని బెదిరించారని కూడా ఆరోపించింది. రెండు వారాలుగా న్యాయం కోసం తిరుగుతున్నా ఎటువంటి స్పందన లభించలేదని షబ్రీన్ పేర్కొంది.ఈ పరిస్థితుల్లో ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడంతో వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో కేసు నమోదు చేసిన బంగారుపాళెం పోలీసులు కానిస్టేబుల్ ఉమాశంకర్, హోం గార్డు కిరణ్ కుమార్ కోసం గాలింపు ప్రారంభించారు.
ఈ ఘటనతో జిల్లా పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా విమర్శలకు దారితీస్తోంది. కాగా, షబ్రీన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్ ఉమాశంకర్, కిరణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.
చిత్తూరు జిల్లాలో..
— Telugu Feed (@Telugufeedsite) September 25, 2025
సాయం కోసం వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అఘాయిత్యం
కీచక కానిస్టేబుల్, హోం గార్డు నుంచి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు
సాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తనను లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ… pic.twitter.com/36igPqFAU2







