అసెంబ్లీ సమావేశం (Assembly Meeting) ప్రారంభం అయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో సభకు సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమైన చర్చలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు సమావేశాలకు ఆలస్యంగా రావడం, ఇంకా పూర్తికాకముందే వెళ్లిపోవడం సీఎం ఆగ్రహానికి కారణమైంది.
సమావేశం ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలే ఉండటంపై సీఎం ప్రశ్నించారు. వెంటనే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) అప్రమత్తమై విప్ (Whip)లకు సూచనలు ఇచ్చారు. విప్‌లు వెంటనే 17 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి సభకు రప్పించారు.
సభ ప్రాముఖ్యతను గుర్తించి, సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఇకపై ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల గైర్హాజరుతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, కీలక చర్చలకు పూర్తి స్థాయిలో హాజరు ఉండేలా చూడాలని విప్‌లకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ పనితీరులో సభ్యుల హాజరు, చర్చల్లో పాల్గొనడం అత్యంత కీలకం అని సీఎం మరోసారి హితవు పలికారు.








