బీజేపీ (BJP)పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్ (Karimnagar)కు ఒక్క పాఠశాల (School) లేదా కనీసం ఒక గుడి (Temple) కూడా తేని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మోసం దేవుడు రాముడి (Rama)కి కూడా తెలిసిందని, అందుకే అయోధ్యలో బీజేపీని ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు.
కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
జీఎస్టీ పై విమర్శలు: అవసరం లేని వస్తువులపై జీఎస్టీ(GST) విధించి, ఇప్పుడు దాన్ని తొలగించి పండగ చేసుకోమంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ(Modi) హామీ ఇచ్చిన రూ.15 లక్షల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
కరీంనగర్ ప్రజలపై: “దేవుడి పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం బీజేపీకి తెలుసు. దాని వల్లనే కరీంనగర్లో బీజేపీని గెలిపించారు. ఎన్నికలు రాగానే మనం ఆవేశపడిపోతున్నాం. కరీంనగర్‌కు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా అక్కడి ప్రజలు బీజేపీకే ఓటు వేశారు” అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్‌పై ఆరోపణలు: హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మలేదని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్మి మోసపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చాలామంది తమ ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్(KCR) గెలుస్తారని భావించారని, అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను గందరగోళం చేసిందని ఆయన ఆరోపించారు.







