ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ(MLC) ఓటు సందర్భంగా జరిగిన ఈ కేసులో తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న జెరూసలేం మత్తయ్య (Jerusalem Matthayya ) ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)పై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు (Supreme Court)కు లేఖ రాశారు. దీంతో ఓటుకు నోట్లు కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే తాను ఈ తప్పు చేసినట్లుగా లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. మత్తయ్య లేఖలో పేర్కొన్న విషయాలు కేసు పరిణామాలను మరోసారి కుదిపేశాయి. ముఖ్యంగా, తీర్పును రిజర్వ్ చేసిన సమయంలో ఈ లేఖ బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మత్తయ్య న్యాయవాది ఈ లేఖలోని అంశాలను త్వరలోనే పిటిషన్ రూపంలో కోర్టులో దాఖలు చేయనున్నట్లు సమాచారం.
ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన మత్తయ్య.. “ఓటుకు కోట్లు కేసులో నేను ఏ4 నిందితుడిని. ఈ కేసులో నా ఒక్కడి పాత్ర లేదు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే నేను ఇన్వాల్వ్ అయ్యా. చేసిన తప్పు వల్ల చంపలేసుకుంటున్నాను. కేసులో ఉన్న సాక్షాలన్నీ ధ్వంసం చేశారు. నాపై దర్యాప్తు జరిపి.. కేసులో ఏమీ లేదని చెప్పేందుకే కుట్ర చేస్తున్నారు” అని ఆరోపించాడు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలి అని మత్తయ్య డిమాండ్ చేశాడు.
తెలంగాణ ప్రభుత్వం మత్తయ్య పాత్రపై దర్యాప్తు జరపాలని వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే వాదనలు పూర్తి చేసి, తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో మత్తయ్య లేఖ వెలుగులోకి రావడం కేసు రాజకీయ వేడి మళ్లీ పెంచింది.








