జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో (By-Election_ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ, ఈసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకాల దీపక్‌రెడ్డి (Deepak Reddy)కి మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూటూరి కీర్తిరెడ్డి (Juturi Keerthi Reddy) మరియు వీరపనేని పద్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.







