ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో ఫ్యాక్షన్ సినిమా (Faction Cinema) తరహా సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. యలమంచిలి (Yelamanchili) మండలం గుంపర్రు (Gumparru) గ్రామంలో ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా ఘోర ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. సరిహద్దు వివాదం కారణంగా రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వైరం చివరికి రక్తపాతం దిశగా దారితీసింది.
గుంపర్రు తుంగ నాగేశ్వరరావు (Gumparru Thunga Nageswara Rao) కుటుంబం, బన్నీ(Bunny)పాల్ (Paul) కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నాగేశ్వరరావు, తన అనుచరులతో కలిసి బన్నీ పాల్ కుటుంబంపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. తమపై దాడి జరుగుతుందనే అనుమానం రావడంతో బన్నీ పాల్ కుటుంబ సభ్యులు భయంతో ఇళ్లను వదిలి పారిపోయారు.
నాగేశ్వరరావు, తన అనుచరులతో ఖాళీ ఇళ్లలోకి చొరబడి, అక్కడి సామాన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, టిడిపి కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పుతోందని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంతమైన జిల్లాలో వేట కొడవళ్లు, గొడ్డళ్ల అలజడి సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు తాము ఇంతకు ముందెప్పుడూ చూడలేదని గోదావరి ప్రజలు అంటున్నారు. కాగా, బన్నీ పాల్ ఇంటిపై దాడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) September 17, 2025
ఫ్యాక్షన్ సినిమా తరహాలో ఒక కుటుంబంపై వేడ కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి
ప.గో. జిల్లా యలమంచిలి మండలం గుంపర్రు గ్రామంలో ఘటన
సరిహద్దు విషయంలో తుంగ నాగేశ్వరరావు, బన్నీ పాల్ కుటుంబాల మధ్య వివాదం
ఈ నేపథ్యంలోనే బన్నీ పాల్ ఫ్యామిలీపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నాగేశ్వరరావు దాడి… pic.twitter.com/2LgRrWNI3I







